
Table of Contents
Mahila Samman Savings Certificate Scheme:- మహిళల కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం. మన భారత దేశంలో కొన్ని కోట్ల మంది మహిళలు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలని వాళ్లు ఉపయోగించుకుంటున్నారు వా పథకాల వల్ల వాళ్లకి చాలా లాభం కూడా వస్తుంది. ఆడవారికి ఈ పథకాలు ద్వారా వాళ్లు కొంచెం డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది ప్రభుత్వం. అలాంటి ఎన్నో పథకాలలో ఈరోజు ఒక మంచి పథకం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పథకం ద్వారా మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా పెట్టుకోవచ్చు దీని ద్వారా మీకు భవిష్యత్తులో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ యొక్క పథకం ద్వారా మనం బ్యాంకులో ఎఫ్డి కంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి ఎందుకంటే మనకి బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాకపోతే ఈ స్కీం లో మనం డబ్బులు పెడితే మనకి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పథకం పేరు మహిళా సమన్ బచ్చత్ పత్రా యోజన ( Mahila Samman Bachat Patra Yojana) లేదా మీరు మహిళా సంఘం సేవింగ్స్ కి అని కూడా అనొచ్చు (Mahila Samman Savings Certificate Scheme.)
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ (MSSC) – 2 ఏళ్లలో వడ్డీతో పొదుపు అవకాశం!
మన భారత దేశంలో ఆడవారికి ఇంకా మహిళలకు వాళ్లకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు మన భారత ప్రభుత్వం ఈ పథకాన్ని(మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Bachat Patra) 2023లో ప్రారంభించారు.
ఈ పథకం మనకి కేవలం మహిళలు అలాగే ఆడవారు లేదా అమ్మాయిల కోసం మాత్రమే ఉంది పురుషులకి ఈ యొక్క పథకం వర్క్ అవ్వదు. ఈ పథకం గరిష్ట కాలం వచ్చేసి దాదాపు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ పరిమితి సమయంలో మహిళలు లేదా ఆడవారు డిపాజిట్ చేయడం ద్వారా వాళ్లకి వడ్డీ వస్తుంది.
How to Apply Mahila Samman Savings Certificate Scheme
ఈ యొక్క పథకం Mahila Samman Savings Certificate Scheme ద్వారా మహిళలు దాదాపు రెండు సంవత్సరాలు వాళ్లు డబ్బుని డిపాజిట్ చేయాలి దానికి ఈ పథకం నుండి 7.5% వడ్డీ వాళ్ళకి లభిస్తుంది మనము బ్యాంకులతో కంపేర్ చేస్తే ఈ వడ్డీ చాలా ఎక్కువ. మీరు ఈ యొక్క ఖాతాని తెరవడం చాలా సులువైన విషయం మీరు ముందుగా కింద ఇచ్చిన స్టెప్స్ ని ఫాలో అవ్వండి మీకు మొత్తం అర్థమవుతుంది.
- మీరు ఒకవేళ 18 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ యొక్క ఖాతాని తెరవాలి అని అనుకుంటే కచ్చితంగా ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు లేదా గార్డియన్ అయితే కచ్చితంగా కావాలి ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి. మైనర్ అమ్మాయి కాబట్టి బీల అవసరం పడుతుంది అదే మేజర్ అమ్మాయి అయితే డైరెక్ట్ గా అమ్మాయి పేరు మీద ఖాతా తెరవచ్చు
- ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయిలు మహిళలు లేదా ఆడవాళ్లు కచ్చితంగా భారతీయులు మాత్రమే అయి ఉండాలి మీరు ఇతర దేశం నుండి వస్తే ఈ యొక్క ఖాతా మీరు అప్లై చేసుకోలేరు కచ్చితంగా మీకు నేషనాలిటీ ఇండియా ఉండి ఉండాలి.
- ఈ Mahila Samman Savings Certificate Scheme యొక్క పథకంలో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఈ పథకం అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎటువంటి వయసు పరిమితి అనేది లేదు ఎటువంటి వయసు గలవారైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- BIS Recruitment 2025 | ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | Excellent Salary ₹1,14,945 | B.Tech వాల్లకి గోల్డెన్ ఛాన్స్!
- 10th class అర్హతతో బ్యాంక్ జాబ్ !! Bank of Baroda Attender Recruitment 2025 | 10th pass govt jobs
- జస్ట్ ₹1,000 పెట్టండి – సర్కార్ 7.5% వడ్డీ ఇస్తుంది | Mahila Samman Savings Certificate Scheme 2025
అవసరమైన డాక్యుమెంట్లు (Required Documents):
- (పాస్‌పోర్ట్ సైజు ఫోటో) Mahila Samman Savings Certificate Scheme మీరు అప్లికేషన్ పెట్టుకోవటానికి మీరు ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే సబ్మిట్ చేయాలి.
- (వయస్సు ధ్రువీకరణ పత్రం) ఈ యొక్క పథకానికి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏజ్ సర్టిఫికెట్ అయితే ఉండేలాగా చూసుకోండి.
- (ఆధార్ కార్డు) ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి మీ వెరిఫికేషన్ మీరు ఏ దేశం కి సంబంధించిన వారు అని తెలుసుకోవడానికి ఈ ఆధార్ కార్డు యూస్ చేయడం జరుగుతుంది
- పాన్ కార్డు ఇన్కమ్ టాక్స్ పాన్ కార్డ్ అని అంటాము ఈ యొక్క కార్డు మీకు లేకపోతే అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ కార్డు ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డు టోటల్ డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి.
ఎవరు అర్హులు? Who is eligible
ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క పథకం అయితే అమ్మాయిలకు కోసం మాత్రమే మీరు అబ్బాయిలు అయితే మాత్రం ఈ యొక్క పథకం మీకు వర్క్ అవ్వదు. Mahila Samman Savings Certificate Scheme మీరు అమ్మాయి మహిళ లేకపోతే ఆడవారు ఎటువంటి వయసుగల వారైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై అయితే చేసుకోగలరు.
అమ్మాయి ఒకవేళ మైనర్ అయి ఉంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేదా గార్డియన్ సమక్షంలో ఆ బ్యాంక్ ఖాతాని అయితే తెరవడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి అర్హులు అవ్వాలి అంటే అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అయితే కచ్చితంగా ఉండాలి. ఇందులో మంచి విషయం ఏంటి అంటే ఇందులో మనకి ఎటువంటి వయసు పరిమితి అనేది లేదు ఎటువంటి వయసు గలవారైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు.
ఖాతా ఎక్కడ తెరవాలి?
ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా మీ దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి ఈ యొక్క పథకం సపోర్ట్ చేస్తున్న బ్యాంకులో మీరైతే ఈ స్కీం అప్లై చేసుకోవచ్చు.
మీకు అర్థం అవ్వలేదు అంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లైక్ SBI, Indian Post Office, Union Bank, Punjab National Bank ఇలాంటి బ్యాంకులోకి వెళ్లి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు,
టిప్స్ (TIPS)
- మీరు ఇందులో Mahila Samman Savings Certificate Scheme మినిమం 1000 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే మీకు రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఈ యొక్క పథకం మీకు ఇస్తుంది. మీరు డిపాజిట్ చేసిన ఆ డబ్బుకి వాళ్ళు 7.5% ఇంట్రెస్ట్ అయితే వీలైతే ఇవ్వడం జరుగుతుంది.
- మీరు డిపాజిట్ చేసిన డబ్బుకి సంవత్సరానికి 7.5% ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది మీకు. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోనే ఆ ఇంట్రెస్ట్ డబ్బు అయితే డిపాజిట్ అవుతుంది.
- కరెక్ట్ గా రెండు సంవత్సరాల తర్వాత మీ అసలు డబ్బు అలాగే మీ వడ్డీ డబ్బు మీరు తీసుకునే అందుకు అర్హులు అవుతారు రెండు సంవత్సరాల వరకు అయితే మీరు ఆ డబ్బుని తీసుకోలేరు.
- మీరు డిపాజిట్ చేసిన డబ్బులు ఒక్కసారి మాత్రమే 40 శాతం వరకు తీసుకునే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువసార్లు లేకపోతే అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశం అయితే ఈ పథకంలో లేదు కాబట్టి ఆలోచించుకొని పథకానికి దరఖాస్తు పెట్టుకోండి.
ఒకవేళ మీకు ఈ ప్రభుత్వ పథకం నచ్చినట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్లే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి లేదా పోతే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్లి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు